అమరావతి: ఏపీ రాజ్ భవన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈనెల 24న నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 

అయితే ఈనెల 23న నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారని తెలిపారు. సాయంత్రం 3 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారని తెలిపారు.

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కు సీఎం వైయస్ జగన్ తోపాటు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు, అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. అలాగే సైనికులతో సర్మోనియల్ స్వాగతం ఉంటుందని తెలిపారు. 

అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి కనకదుర్గమ్మను దర్శించుకోనున్నట్లు తెలిపారు. అనంతరం 
రాత్రికి రాజ్ భవన్ కు చేరుకుంటారని తెలిపారు. మరుసటి రోజు ఈనెల 24న ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎల్ ఎల్వీ ప్రసాద్ తెలిపారు.