Asianet News TeluguAsianet News Telugu

ఏపీ స్ట్రెయిన్‌పై రాద్ధాంతం.. అలాంటిదేది లేదు: తేల్చిచెప్పిన కోవిడ్ టెక్నికల్ కమిటీ

ఏపీ స్ట్రెయిన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీసీఎంబీ నివేదికలో అసలు ఏపీ స్ట్రెయిన్ ప్రస్తావనే లేదని ఆయన వెల్లడించారు. ఎన్ హెచ్ 44 అనే స్ట్రెయిన్ మొదటి దశలోనే వుందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. 

ap covid technical committee clarifies ap strain ksp
Author
Amaravathi, First Published May 6, 2021, 3:23 PM IST

ఏపీ స్ట్రెయిన్ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ కోవిడ్ టెక్నికల్ కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీసీఎంబీ నివేదికలో అసలు ఏపీ స్ట్రెయిన్ ప్రస్తావనే లేదని ఆయన వెల్లడించారు. ఎన్ హెచ్ 44 అనే స్ట్రెయిన్ మొదటి దశలోనే వుందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. 

కాగా, ఇదే అంశంపై ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో గురువారం దీనిపై వివరణ ఇచ్చారు. గత ఏడాది జూన్, జులై‌లో ఈ స్ట్రెయిన్‌ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నమూనాలు నుంచి సీసీఎంబీ గుర్తించిందని వెల్లడించారు.

Also Read:ఎన్440కే రాష్ట్రంలో లేదు.. ఏపీపై ఎందుకీ అబాండాలు: చంద్రబాబుపై పేర్నినాని విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్440కే వేరియెంట్ ఫిబ్రవరి వరకు కనిపించి క్రమంగా తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం ఈ రకం వైరస్‌ను చాలా తక్కువ‌గా గుర్తిస్తున్నామని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశ నమూనాల నుంచి బి.1.617, బి1 రకాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ నెల డేటా ఆధారంగా దీనిని గుర్తించామని ఆయన చెప్పారు. అయితే మిగిలిన వెరియేంట్‌లతో పోలీస్తే ఇది చాలా తొందరగా వ్యాప్తి చెందుతోందని జవహర్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా యువతలో సైతం దీని వ్యాప్తి అధికం ఉంటుందని ఆయన వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బి.1.617ను వేరియెంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. అయితే ఎన్440కే పై ఎలాంటి ప్రస్తావన చేయలేదని జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios