అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ పై అసహనం వ్యక్తం చేశారు ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అసెంబ్లీ గేటు వద్ద గురువారం చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వీడియోను శాసన మండలిలో ఎలా ప్రదర్శిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

శాసన మండలికి  వస్తుంటే మార్షల్స్ తమను అడ్డుకున్నారని మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ కు టీడీపీ ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి తమవద్ద వున్న వీడియోను చైర్మన్ కు అందజేశారు. 

బాత్ రూమ్ దగ్గర దాక్కునేవాళ్లం,.. వాళ్ళ అంతలా వేధించారు: వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన...

తెలుగుదేశం పార్టీ సభ్యులు అందజేసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శించడానికి రూలింగ్ ఇచ్చారు శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్. టీడీపీ సభ్యులు అందజేసిన వీడియోను శాసనమండలిలో ప్రదర్శిస్తామని ప్రకటించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ సభ్యులు ఇచ్చిన వీడియోను ప్రదర్శించేందుకు రూలింగ్ ఎలా ఇస్తారంటూ నిలదీశారు. టీడీపీ సభ్యులకు అవమానం జరిగితే శాసన సభా ప్రాంగణంలో ఉన్న కెమెరాలలోంచి ఉన్న వీడియోను సేకరించాలని సూచించారు. 

చంద్రబాబు గిల్లుడుకు ఆ ఎమ్మెల్యే ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యే రాజా.

తెలుగుదేశం సభ్యుడికి అవమానం జరిగితే ఏ టైం లో జరిగింది, ఎక్కడ జరిగింది అన్న అంశాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు సభా ప్రాంగణంలో ఉన్న కెమెరాలు నుంచి వీడియో తీసుకోవాలని సూచించారు. 

అంతేగానీ తెలుగుదేశం సభ్యులు ఇచ్చిన వీడియో ప్రదర్శించి సభలో కొత్త సాంప్రదాయాలకు తెరలేపవద్ది మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. శాసన సభ ప్రాంగణంలోఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను ప్రదర్శించాలని మంత్రి బొత్స సత్యనారాయణ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ కు సూచించారు. 

ఏపీ అసెంబ్లీలో దిశ చట్టం, మృగాలకు ఉరే సరైన శిక్ష:హోంశాఖ మంత్రి సుచరిత...