సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు, వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు . మీరు పోలీసులా లేక వైసీపీ కిరాయి మనుషులా , ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు హక్కు..? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నేతలపై పోలీసులు, వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్లు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు . ఈ మేరకు ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా .. గొంతు పిసికి చంపాలని చూస్తారా..? వైసీపీ గూండాలను పక్కనపెట్టి మరీ దాడులు చేయిస్తారా..? మీరు పోలీసులా లేక వైసీపీ కిరాయి మనుషులా , ఇష్టారాజ్యంగా కొట్టడానికి ఎవరిచ్చారు హక్కు..? కండువా లేని వైసీపీ కార్యకర్తలు మన పోలీసులు. సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలని .. విచక్షణారహితంగా కొట్టిన పోలీస్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి ’’ అని షర్మిల డిమాండ్ చేశారు. 

కాగా.. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని.. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్ గాలికొదిలేశారని యూత్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బై బై జగన్ రెడ్డి.. బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్ఎస్‌యూఐ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. 

Scroll to load tweet…