అమరావతి: ఏపీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఉమెన్ చాందీ ఈ నెల 9వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో  ఉమెన్ చాందీ పర్యటన ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

 ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇంచార్జీగా ఉమెన్ చాందీని నియమించారు. ఏపీ ఇంచార్జీగా బాధ్యతలు ఉమెన్ చాందీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకొంటున్నారు.

2014కు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం  ఏ పార్టీలో చేరకుండా ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.  మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు.

కిరణ్‌కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ  ఏపీ రాష్ట్ర ఇంచార్జీ ఉమెన్ చాందీని కలిశారు.  త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఏపీలో పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చేందుకు  ఈ నెల 9వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉమెన్ చాందీ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

తొలి విడత పర్యటనలో భాగంగా ఈ నెల 9 నుంచి 12 వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో  ఉమెన్ చాందీ పర్యటించనున్నారు. 16వ తేదీ నుంచి 19 వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్, విశాఖపట్టణం సిటీలో పర్యటిస్తారని పర్యటిస్తారు. 

ఈ నెల 23వ తేదీ నుంచి 26 వరకు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో, 30వ తేదీన తూర్పు గోదావరి, 31న పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని  కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల కార్యకర్తల సమావేశాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.