బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సీఎంవో కౌంటర్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు న్యూయార్క్ పర్యటనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఇన్విటేషన్ ను బహిర్గతం చెయ్యాలన్న జీవీఎల్ డిమాండ్ కు స్పందించిన సీఎంవో ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్నివిడుదల చేసింది. 

అమరావతి: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు సీఎంవో కౌంటర్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు న్యూయార్క్ పర్యటనకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఇన్విటేషన్ ను బహిర్గతం చెయ్యాలన్న జీవీఎల్ డిమాండ్ కు స్పందించిన సీఎంవో ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్నివిడుదల చేసింది. ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసించినట్లు తెలిపింది.

ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడేందుకు చంద్రబాబును ఐక్యరాజ్యసమితి ఆహ్వానించినట్లు తెలిపింది. గత నెల 22న చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఆహ్వానం పంపినట్లు తెలిపింది. 

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ ఎరిక్ సాల్‌హిమ్ పేరుతో సీఎం చంద్రబాబును ఐక్యరాజ్యసమితి పిలిచినట్లు తెలిపింది. చంద్రబాబు స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతారని ఐక్యరాజ్యసమితి లేఖలో ప్రశంసించినట్లు సీఎంవో పేర్కొంది.

చంద్రబాబు అమెరికా పర్యటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్న ఉద్దేశం ఒకటి.. చెప్పేదొకటని జీవీఎల్ విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో వారి పంపిన ఇన్విటేషన్ ఏంటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశాలకు వెళ్తూ ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్తున్నట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు విమానం ఎక్కే లోపే ఐక్యరాజ్యసమితి పంపిన ఇన్విటేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్‌లో సదస్సు పెట్టినంత మాత్రాన ఐక్యరాజ్యసమితిలో సమావేశం పెట్టినట్లు కాదన్నారు. 

వరల్డ్ ఎకనామిక్ వారు న్యూయార్క్‌లో పెడుతున్న రెండో సమావేశమేనని వివరించారు. చంద్రబాబు గొప్పల కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దని జీవీఎల్ హితవుపలికారు. ఈ నేపథ్యంలో సీఎంవో ఐక్యరాజ్యసమితి ఆహ్వానాన్ని విడుదల చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు పర్యటనపై ఎంపీ జీవీఎల్ అనుమానాలు