ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులు ఘనంగా సత్కరించారు. ఈ నెలాఖరున ఆమె పదవి విరమణ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కేబినెట్ సహచరులు ఘనంగా సత్కరించారు. ఈ నెలాఖరున ఆమె పదవి విరమణ చేయనున్నారు.
శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో సీఎం శాలువాతో సత్కరించారు. 2019 నవంబర్ 14న ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు.
అంతకుముందు నీలం సాహ్ని పదవీకాలం పొడిగించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వరకు ఆమె పదవికాలాన్ని కేంద్రం పొడిగించింది. అనంతరం మరో మూడు నెలలు పాటు దానిని పొడిగించింది.
1984 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి అయిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా.. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు.
మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పని చేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుంచి ఇటీవలి వరకు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత కార్యదర్శిగా పనిచేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 18, 2020, 3:25 PM IST