రేపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. రేపు రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అమిత్ షాతో జగన్ చర్చించనున్నారు.

పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముంది. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసే అవకాశముంది. అలాగే ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జగన్ కలవనున్నారు.

ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. కాగా కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.