అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రీటెండరింగ్ కు వెళ్లాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. రీటెండరింగ్ వద్దని నవయుగ కంపెనీతోనే పనులు కొనసాగించాలని కోరారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కె.రామకృష్ణ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్‌లో రీటెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని లేఖలో కోరారు. నవయుగ కంపెనీ నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కించుకుందని వెల్లడించారు. 

ఒరిజినల్ ధర కన్నా 14 శాతం తక్కువకే నవయుగ పనులు చేసిందని తెలిపారు. అంతేకాదు కాంక్రీట్ పనులు చేయడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విషయాన్ని  రామకృష్ణ గుర్తు చేశారు. 

నవయుగ కంపెనీతోనే పోలవరం పనులు కొనసాగించాలని సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. రీటెండరింగ్ వల్ల నిర్మాణ వ్యయం, పనుల్లో జాప్యం పెరుగుతోందే తప్ప లాభం ఏమీ ఉండదన్నారు. ఇకపోతే కాంట్రాక్టులను మార్చడం వల్ల ప్రాజెక్ట్‌ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 


ఈ వార్తలు కూడా చదవండి

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు