న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం జగన్. జగన్ తోపాటు పలువురు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి  సైతం మోదీని కలిశారు. 

ఈనెల 15న వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించారు సీఎం జగన్. అనంతరం పీపీఏల అంశంపై కూడా చర్చిస్తున్నారు. 

ఇకపోతే పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై మోదీకి వివరించారు సీఎం జగన్. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి ఆదా అయిన వ్యయ వివరాలను సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీకి వివరించారు. అలాగే విభజన సమస్యలు, నదుల అనుసంధానంపై కూడా చర్చిస్తున్నారు.