Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం జగన్ భేటీ

ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ గా బీబీ హరిచందన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా హరిచందన్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ గవర్నర్ గా నరసింహన్ కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారిగా గవర్నర్ తో భేటీ అయ్యారు. 

 

ap cm ys jaganmohan reddy met telangana governor narasimhan
Author
Hyderabad, First Published Aug 1, 2019, 1:56 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ పనిచేశారు. వైయస్ జగన్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది కూడా నరసింహన్.

అయితే ఇటీవలే ఏపీకి కొత్త గవర్నర్ గా బీబీ హరిచందన్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా హరిచందన్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ గవర్నర్ గా నరసింహన్ కు వీడ్కోలు పలికిన తర్వాత తొలిసారిగా గవర్నర్ తో భేటీ అయ్యారు. 

తెలంగాణలో రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ కానున్న నేపథ్యంలో ఆ భేటీలో చర్చించాల్సిన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. 

ఇకపోతే గురువారం సాయంత్రం సీఎం వైయస్ జగన్ కుటుంబ సమేతంగా పవిత్ర పుణ్యక్షేత్రం జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు. నాలుగురోజులపాటు జెరూసలేంలోనే గడపనున్నారు.  అనంతరం తిరిగి ఐదో తేదీన మధ్యాహ్నం అమరావతి చేరుకుంటారు. 

ఈనెల 6న అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 6న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్టు నిధులు, పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు సహకరించాలి ప్రధాని మోదీని కలవనున్నారు. 

అనంతరం ఈనెల 8న అనంతపురం జిల్లాలో సీఎం వైయస్ జగన్ పర్యటించనున్నారు. కియా ను సందర్శిస్తారని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వెల్లడించారు. 
నవరత్నాల అమలుపై నివేదికను తయారు చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు కలెక్టర్.  

ఆయా శాఖల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన నివేదికను కూడా ఇవ్వాలని ఆదేశించారు. 

జేసీ2  ,పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ పర్యటనకు సంబంధించి కియా యాజమాన్యం  సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు
 

Follow Us:
Download App:
  • android
  • ios