ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పనులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాఫర్ డ్యాం పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని 
సీఎం అధికారులను ప్రశ్నించినట్టుగా సమాచారం.

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా గురువారం నాడు పోలవరం ప్రాజెక్టును జగన్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కాఫర్ డ్యాం తో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలపై అధికారుల నుండి ఆరా తీసినట్టుగా సమాచారం.

కాఫర్ డ్యాం పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. భారీగా వరద వస్తే పరిస్థితి ఏమిటని జగన్ ప్రశ్నించారని సమాచారం. వర్షాలు వస్తున్నాయి.....గోదావరిలో వరద పెరిగే అవకాశం ఉంది... ఇంకా ప్రాజెక్టుకు సంబంధించిన కాఫర్ డ్యాం పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారని  సమాచారం.సీఎం జగన్ ప్రశ్నలతో అధికారులు కొంత ఇబ్బందిపడినట్టుగా తెలుస్తోంది.