Asianet News TeluguAsianet News Telugu

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు. 

AP CM YS Jagan Unfurls National Flag
Author
Vijayawada, First Published Aug 15, 2020, 9:33 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 74వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేశారు.  అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

జెండాను ఆవిష్కరించే ముందు ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "నేడు మనం ఆనందిస్తున్న స్వేచ్ఛను మనకు ప్రసాదంగా ఇచ్చిన వీరులకు నా వందనాలు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించినవారికి వందనం. మన దేశం విలువలను కాపాడుకుంటామని, దేశ ప్రతిష్టను రక్షిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం దేశ పురోగతికి కంకణబద్ధులమవుదాము" అని అన్నారు 

సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు  కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios