అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. 

జగన్ పాదయాత్రకు దెబ్బకొట్టేందుకు ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షల పేరుతో దీక్షలకు దిగుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఒకరిపై ఒకరు విమర్శల దాడులతో  పొలిటికల్ గా రాష్ట్రం వేడెక్కుతోంది. 

అలాంటి సమయంలో అక్టోబర్ 25 మధ్యాహ్నాం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వీఐపీ లాంజ్ లో ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. 

యావత్ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశమంతా ఈ ఘటనతో ఉలిక్కిపడింది. ప్రధాని నరేంద్రమోదీ దగ్గర నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా జగన్ ను పరామర్శించారు. ఇకపోతే ఏపీలో ప్రజలు, వైసీపీ నేతలు అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ కోసం వీఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను ఫ్యుజన్ హోటల్ వెయిటర్ శ్రీనివాస్ టీ తీసుకువచ్చాడు. లాంజ్ లో జగన్ ను ఆప్యాయంగా పలకరించాడు. 160 సీట్లు వస్తాయా సార్ అంటూ మాటలు కలిపాడు. 

ఆ తర్వాత సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు. సరే దగ్గరకు రమ్మని జగన్ పర్మిషన్ ఇవ్వడంతో తనతో తెచ్చుకున్న కోడికత్తితో ఒక్కసారిగా జగన్ భుజంపై దాడి చేశాడు. దాంతో జగన్ ఎడమ భుజం తీవ్రగాయమైంది. 

జగన్ పై కత్తితో దాడి నేపథ్యంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది, ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎయిర్ పోర్ట్ లోనే జగన్ కు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం హైదరాబాద్ కు తరలించారు. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందిన తర్వాత ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు జగన్. 

జగన్ పై కత్తితో దాడి అంశం రాష్ట్రాన్ని కుదిపేసింది. 294 రోజులపాటు 3,299 కిలోమీటర్ల మేర పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ దాడి అనంతరం జరిగిన పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు.  

విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా కత్తితో దాడి జరిగింది. దాడి అనంతరం విశ్రాంతి తీసుకున్న జగన్ ఆ తర్వాత మళ్లీ విజయనగరం నుంచే పాదయాత్ర చేపట్టారు. ఇకపోతే జగన్ పై దాడి గంటలోనే డీజీపీ ఠాకూర్ ప్రెస్మీట్ వైసీపీ సానుభూతిపరుడు దాడేనంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో కలవరపాటుకు గురి చేసింది. 

ఇదంతా టీడీపీ చేసిన కుట్రేనంటూ వైసీపీ చేసిన ఆరోపణలు ప్రజల్లో సందేహాలు రేకెత్తించాయి. అంతేకాదు జగన్ పై దాడి అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఒక ప్రచార అస్త్రంగా కూడా వాడుకుంది. 

వైయస్ జగన్ ను అంతమెుందించేందుకు కుట్ర జరుగుతుందంటూ వైసీపీ చేసిన ప్రచారం ఆ పార్టీ కార్యకర్తల్లో కసిని పెంచిందని రాజకీయ వర్గాల్లో వినికిడి. దాంతోనే వైసీపీ కార్యకర్తలు జగన్ అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో పనిచేశారని చెప్పుకుంటారు. మెుత్తం జగన్ ని సీఎం పీఠంపై కూర్చున్నారు. 

ఇకపోతే రాష్ట్ర రాజకీయాల్లో జగన్ సంచలన నాయకుడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనపై ఎప్పుడు దాడి అనేదే జరగలేదు. అలాంటిది జగన్ జీవితంలో తొలిసారిగా ఒక యువకుడు కత్తితో దాడి చేయడం ఎవరూ ఊహించని పరిణామం. 

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ పై దాడి కేసు నిందితుడికి ప్రాణ హాని..కేసును బదిలీ చేయాలంటూ

జగన్ పై దాడి కేసు నిందితుడు శ్రీనివాస రావు సంచలన ఆరోపణలు

జగన్ పై దాడి కేసు: శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఎ పిటిషన్.