అమరావతి: ఈ  నెల 14వ తేదీన ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ ను ఆమోదించాలని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను శుక్రవారం నాడు కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయమై మంత్రులు షెకావత్ ను కోరారు. 15 రోజుల్లో ప్రాజెక్టు సందర్శనకు తాను వస్తానని కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ మంత్రులకు చెప్పారు.

ఈ తరుణంలోనే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు  సీఎం జగన్ సోమవారం నాడు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారంగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ సర్కార్  పెద్దగా పట్టించుకోలేదని వైసీపీ నేతలు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండానే పూర్తి చేసినట్టుగా ప్రచారం చేసుకొందని టీడీపీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.