ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 29 ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ ఢిల్లీలోనే ఉంటారు. ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం YS Jagan ఈ నెల 29న Delhi కి వెళ్లనున్నారు. ప్రధాని Narendra Modi తో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు.ఈ నెల 30న న్యూఢిల్లీలో జరిగే Judicial Infrastructure seminarసదస్సులో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV Ramana, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. దేశంలో న్యాయ మౌళిక సదుపాయాల కల్పన, కేసు సత్వర పరిష్కారంపై సెమినార్ ను నిర్వహించనున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఈ నెల 5, 6 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించారు. రాష్ట్రానికి సంబంధించి పలు విషయాలపై ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర విషయాలపై జగన్ చర్చించారు.
