Asianet News Telugu

మద్య నియంత్రణలో జగన్ మరో కీలక నిర్ణయం, కొత్త ఏడాది నుంచే అమలు

మద్యపాన నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

ap cm ys jagan takes key decision on liquor prohibition
Author
Amaravathi, First Published Nov 7, 2019, 7:04 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మద్యపాన నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

ఆదాయశాఖలపై ముఖ్యమంత్రి గురువారం అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వస్తున్న ఆదాయాన్ని అధికారులు జగన్‌కు వివరించారు. జనవరి 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆయన సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని.. బార్లకు అనుమతినిచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మకాలు జరగాలని.. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ చీప్ లిక్కర్ ను మిక్స్ చేసేసి, బాటిళ్లపై మూతల్ని స్థానికంగా తయారు చేయించేసి, ఆదాయం సమకూర్చుకున్నవారికి ఇక బ్రేక్ పడనుంది.

గత ప్రభుత్వం హాయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు, బార్ లపై ఇన్నాళ్లూ జన ప్రియ పుష్కర గణేష్ సిండికేట్లు డాన్ లుగా ఉండేవి. మద్యం వ్యాపారంపై చాలా వరకు ఎమ్మెల్యే వెలగపూడిదే పైచేయి అయ్యేది. తన అనూయాయులతో అవసరమైతే భౌతిక దాడులకు కూడా తెగబడిన సందర్భాలు ఉన్నాయి.

Also read:ఏపీలో మద్యం సిండికేట్ల మాఫియాకు.. సీఎం జగన్ చెక్

ఇప్పుడా 30ఏళ్ల చరిత్ర కాలగర్భంలో కలిసిపోనుంది. ఎన్నికల హామీలో భాగంగా దశలవారీ మధ్య నిషేధం అమలు చేసిన ప్రభుత్వం తొలుత మద్యం దుకాణాలను క్రమంగా తగ్గించనుంది.

ప్రభుత్వమే మద్యం విక్రయించేందుకు వచ్చే నెల 1న ముహుర్తం ఖరారు చేసింది. అక్టోబర్ 2నాటికి పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో ప్రైవేటు మద్యం వ్యాపారులంతా రాష్ట్రం వదిలి వెళ్లిపోయే పరిస్థితి  దాపురించింది.

‘మద్యపానం ప్రాణానికి హానికరం’ అంటూ కొత్తగా బోర్డులు రానున్నాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న 402 మద్యం దుకాణాల లైసెన్సులకు గడువు ముగిసిపోనుంది. మొన్నటి జూన్ కే గడువు ముగిసినా, కొత్త ప్రభుత్వం రావడం, కొత్త మద్యం  పాలసీ తెరమీదకు రావడంతో పాత లైసెన్సు వ్యవధిని పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపేలా జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

Also Read:ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ: తిరుపతిలో మద్యం దుకాణాలు బంద్

ప్రభుత్వం తరపున నడవనున్న మద్యం దుకాణాలకు సంబంధించి ఇప్పటికే విధి విధానాలు ఖరారయ్యాయి. జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో ఇప్పటికే నడుస్తున్న మద్యం దుకాణాల సిబ్బందికి ఉపాధి లభించేలా చేస్తున్నారు.

అదే భవనం, ఫర్నీచర్ ను అద్దెకు తీసుకునేలా చర్యలు చేపట్టారు. గ్రామాల్లో మద్యం దుకాణాల్లో ఓ సూపర్ వైజర్, ఇద్దరు సిబ్బంది, ఓ నైట్ వాచ్ మెన్ ఉంటారని, నగరాలు, పట్టనాల్లో ఓ సూపర్ వైజర్ తో పాటు ముగ్గురేసి సేల్స్ మన్, ఓ నైట్ శాచ్ మన్ ఉండాలని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios