అమరావతి:   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ  శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  పడి పడీ నవ్వారు. 

గురువారం నాడు  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ హాజరుకావడాన్ని టీడీపీ సభ్యులు తప్పుబట్టారు.

ఈ విషయమై టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. పరస్పరం విమర్శలు చేసుకొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కామెంట్స్‌ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడారు. ఆ తర్వాత తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. 

కానీ, అప్పటికే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. సీఎం జగన్ తమపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. 

ఈ సమయంలో  టీడీపీ శాసనసభపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు తమకు అవకాశం కల్పించాలని పదే పదే కోరారు. ఈ సమయంలో  మంత్రులు బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్‌కుమార్‌లు కూడ జోక్యం చేసుకొని టీడీపీపై విమర్శలు గుప్పించారు.

అయితే ప్రస్తుతం ప్రశ్నోత్తరాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సరైన పద్దతిలో వస్తే ఈ విషయమై చర్చించేందుకు రావాలని  స్పీకర్  తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులు కోరారు.

ఈ సమయంలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతు గోదావరి నది ఎక్కడ నుండి  ఎలా ఏపీ రాష్ట్రంలోకి వస్తోందనే  విషయమై   సీఎం జగన్ తో చెప్పించుకోవడం తమ దౌర్భాగ్యమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో ఏపీ సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వారు.

 

సంబంధిత వార్తలు

బాబు వర్సెస్ జగన్: వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులు

బావమరిది శవాన్ని పక్కనే పెట్టుకొని పొత్తులు మాట్లాడారు: బాబుపై జగన్

నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం