అమరావతి:  ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాలపై జరిగిన సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొన్నాయి. ఈ సమయంలో  రెండు పార్టీల సభ్యులు ఒకరిపై మరోకరు సామెతలు, చలోక్తులతో విమర్శలకు దిగారు.  ఈ సమయంలో విపక్ష సభ్యుల కామెంట్స్‌కు కొన్ని సమయాల్లో  ఏపీ సీఎం జగన్ నవ్వారు. కొన్ని సమయాల్లో విపక్షంపై తీవ్ర మిర్శలు చేస్తూ కూడ నవ్వారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్లడాన్ని  టీడీపీ తప్పుబట్టింది. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన సమయంలో పెంచారని  ఏపీ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.ఈ విషయమై చంద్రబాబుపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ల కాలంలో సీఎంగా ఉన్న కాలంలోనే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే  గాడిదలు కాశారా అని జగన్ విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తాను సామెతను మాత్రమే గుర్తు చేశానని  ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్తే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. 

గోదావరి నది నీటిని కృష్ణా ఆయకట్టు స్థిరీకరించేందుకుగాను  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారని జగన్ చెప్పారు. జగన్ సామెతలపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడ కౌంటరిచ్చారు. తన రాజకీయ అనుభవమంతా  వయస్సు జగన్‌కు లేదని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ కామెంట్స్‌పై జగన్ పడి పడి నవ్వారు.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గతంలో  కేసీఆర్‌ను హిట్లర్‌తో పోలుస్తూ జగన్ చేసిన విమర్శలను ఆయన గుర్తు చేశారు.

 

సంబంధిత వార్తలు

బావమరిది శవాన్ని పక్కనే పెట్టుకొని పొత్తులు మాట్లాడారు: బాబుపై జగన్

నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు: చంద్రబాబు

కేసీఆర్ అడుగు ముందుకేశారు, కక్ష ఎందుకు: చంద్రబాబుపై జగన్ ధ్వజం