అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన జీరో అవర్ ఇంతవరకు పూర్తికాలేదని.. కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చామని .. బడ్జెట్‌పై ఎప్పుడు చర్చ జరగాలని ఆయన ప్రశ్నించారు.

సీట్లెక్కడ ఉండాలి...  ఎవరి పక్కన కూర్చోవాలంటూ ప్రతిపక్ష సభ్యులు సమయాన్ని వృథా చేస్తోందంటూ జగన్ మండిపడ్డారు. అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు లావుగా, పొడుగ్గా ఉన్నారనే అన్నాము తప్పించి ఎటువంటి అసభ్యపదజాలాన్ని వినియోగించలేదన్నారు. 

డిప్యూటీ లీడర్లకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు స్పీకర్‌ను కోరారు. దీనిపై స్పందించిన అధికార పక్షం నిబంధనలను అనుసరించే అచ్చెన్నాయుడికి సీటు కేటాయించామని తెలిపింది. సభా సంప్రదాయాలు పాటించాలని చంద్రబాబు కోరడంతో.. తనను ఎవరు బెదిరించలేరని స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు.