టీడీపీ అంటే తినుకో..దండుకో..పంచుకో: చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ ఫైర్

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై  ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు  చేశారు.  చంద్రబాబు, పవన్ కళ్యాణ్  లు  తమ ప్రభుత్వం  చేస్తున్న  అభివృద్ధిని  చూసి ఓర్వలేక  విమర్శలు  చేస్తున్నారన్నారు. 

 AP CM YS Jagan  Serious Comments  On  TDP Chief  Chandrababu naidu lns

కురుపాం:టీడీపీ అంటే  తినుకో, దండుకో, పంచుకో అని  ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.అధికారం కోసం అమలుకాని  హామీలు ఇవ్వడం  చంద్రబాబుకు అలవాటేనన్నారు.ప్రజలను మోసం  చేసేందుకు చంద్రబాబు మళ్లీ  డ్రామాలు మొదలుపెట్టారని  సీఎం జగన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు  ఇచ్చిన హామీలను  చంద్రబాబు అమలు  చేయలేదన్నారు.2014లో  అధికారంలోకి వచ్చిన తర్వాత  చంద్రబాబు  ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కారన్నారు.  ఎన్నికలయ్యాక  ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేకపోతే  పవన్ కళ్యాణ్ ఎందుకు  ప్రశ్నించలేదని  జగన్  ప్రశ్నించారు.

దుష్ట చతుష్టయం  సమాజాన్ని చీల్చుతుందన్నారు.రాష్ట్రంలో మంచి చేస్తున్నందుకుగాను  దుష్టచతుష్టయం తమ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుందని సీఎం జగన్  చెప్పారు. నమ్మించి ప్రజలను నట్టేట ముంచటమే  వారికి తెలిపిన ఏకైక  నీతి అని ఆయన   వ్యాఖ్యానించారు.ప్రజలను మోసం  చేసేందుకు చంద్రబాబునాయుడు మళ్లీ డ్రామాలు  మొదలు పెట్టారన్నారు. తమ పునాదులు  సామాజిక న్యాయంలో ఉన్నాయన్నారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో తమ పునాదులున్నాయని సీఎం జగన్ వివరించారు. 

పేదల కష్టాల నుండే తమ పునాదులు ఏర్పడ్డాయన్నారు. వెన్నుపోటు, అబద్దాలపై తమ పునాదులు లేవని సీఎం జగన్  ఎద్దేవా  చేశారు.  తమ పునాదులు  ఓదార్పు యాత్ర నుండి పుట్టిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు  చేశారు.

also read:దత్తపుత్రుడిలా నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం: పవన్ కల్యాణ్ పై జగన్

రాష్ట్రంలో పేదలకు  మంచి చేస్తున్నందుకు  చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన దత్తపుత్రుడు  కూడ  ఇందుకు  వంతపాడుతున్నాడని  సీఎం జగన్ విమర్శలు  చేశారు. మూడు దఫాలు  సీఎంగా  పనిచేసినా కూడ  ఏ మంచి పని చేయని చరిత్ర  చంద్రబాబుదని  జగన్ విమర్శించారు. 

మన రాష్ట్రంలో  మంచి చేయవద్దని  చెప్పే నాలుగు కోతులున్నాయని  సీఎం  జగన్ ఎద్దేవా  చేశారు. మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అనేది వారి విధానమన్నారు. మహాత్మాగాంధీ  చెప్పిన  మూడు కోతుల కథను గుర్తు  చేస్తూ  నాలుగు  కోతుల కథ గురించి  సీఎం జగన్ వివరించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios