సభలో హుందాగా వ్యవహరించాలి: టీడీపీపై అసెంబ్లీలో జగన్ ఫైర్

జంగారెడ్డిగూడెం ఘటనపై టీడీపీ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ విషయమై ఇవాళ ఉదయం నుండి టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలో సీఎం జగన్ జోక్యం చేసుకొన్నారు.

AP CM YS Jagan serious Commeents on TDP In Assembly

అమరావతి:అసెంబ్లీలో TDP సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఏపీ సీఎం YS Jagan సూచించారు. Jangareddy Gudem మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

జంగారెడ్డిగూడెం మిస్టరీ మరణాలపై టీడీపీ సభ్యులు గొడవ చేస్తుండడంతో ఈ విషయమై సీఎం జగన్  మంగళవారం నాడు   జోక్యం చేసుకొన్నారు.సభలో టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని కోరారు. 55 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఎవరైనా సారా తయారు చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. ఏదో మారుమూల గ్రామాల్లో సారా తయారు చేస్తారంటే నమ్మొచ్చు కానీ మున్సిపాలిటీలో సారా తయారు చేస్తారంటే ఎలా నమ్ముతామని ఆయన ప్రశ్నించారు. 

నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నాటుసారా తయారీ సాధ్యమా అని జగన్ అడిగారు. నాటు సారా కాసే వాళ్ల మీద తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.  నాటు సారా కాసే వాళ్లపై ఇప్పటికే 13 వేల మంది కేసులు నమోదు చేశామని సీఎం జగన్ వివరించారు. 

Illicit liquor అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చిన విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై ఇప్పటికే సవివరమైన స్టేట్‌మెంట్ ఇచ్చామన్నారు.టీడీపీ గోబెల్స్ సిద్దాంతాన్ని నమ్ముకుందన్నారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలతో కలిసి టీడీపీ జంగారెడ్డిగూడెం ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఒకే అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ టీడీపీ తీరును దయ్యబట్టారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా తప్పుదు ప్రచారం చేస్తున్నారని  ఆయన టీడీపీపై మండిపడ్డారు. ఇటీవల కాలంలో  జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయని కూడా చెబుతున్నారు. అయితే ఇందులో దాదాపు 10 మంది క‌ల్తీ సారా తాగ‌డం వ‌ల్ల‌నే చనిపోయార‌నే ప్రచారం కూడా లేకపోలేదు. 

ఈ మరణాలపై  ద‌ర్యాప్తు నిర్వ‌హించ‌డానికి ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ హైమావ‌తి విజ‌య‌వాడ జీజీహెచ్ డాక్ట‌ర్ల టీమ్  జంగారెడ్డి గూడెనికి  చేరుకుంది. మృతుల కుటుంబాల ఇళ్ల‌కు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి  వివ‌రాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో ప‌ర్య‌టించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అల‌వాటు ఉంద‌ని చెప్పారు. ఇందులో ప‌లువురు ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధప‌డుతున్న వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. మ‌రి కొంద‌రు 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఉన్నార‌ని పేర్కొన్నారు. 

ఈ మ‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌లువురు అధికారులు  స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యారు. గురువారం ఒక‌రు హాస్పిట్  ల‌కు వెళ్లిన కొంత స‌మ‌యానికి మృతి చెందారు. అయితే ఆయ‌న మృత‌దేహానికి పోస్టు మార్టం చేయ‌లేదు. ఇలా మృతి చెందిన వారెవ‌రికీ పోస్టు మార్టం నిర్వ‌హించ‌లేదు. దీంతో అస‌లు మ‌ర‌ణాలు ఏ కార‌ణంతో సంభ‌విస్తున్నాయ‌నే అంశంపై ఓ క్లారిటీకి రాలేక‌పోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios