అమరావతి: పీపీఏల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. పీపీఏల పున:సమీక్షను విరమించుకోవాలని కేంద్రం కోరినప్పటికీ జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 

తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ . విండ్, సోలార్ కంపెనీల నుంచి విద్యుత్ ను తీసుకోవడాన్ని నిలిపివేశారు. బ్యాక్ డౌన్ తరహాలో విద్యుత్ ను తీసుకునే ప్రక్రియను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. 

పగటిపూట సౌర విద్యుత్ ను తీసుకోవడాన్ని నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యాక్సిస్ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు, విచారణ ఎల్లుండికి వాయిదాసింది.