అభివృద్ధి కోసం నిధులు అడిగితే నాటి టీడీపీ ప్రభుత్వ నేతలు పార్టీ మారితే మూడు కోట్లు ఇస్తామని రాయచోటి మున్సిపల్ ఛైర్మన్‌తో బేరం మాట్లాడారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. కడప జిల్లాలో మూడు రోజల పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Also Read:ఈ నెల 27న విశాఖలో ఏపీ కేబినెట్ సమావేశం?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆరు నెలల కాలంలో రూ.2000 కోట్లు ఖర్చు పెడుతున్నామని సీఎం తెలిపారు. టీడీపీ హయాంలో గొంతు తడుపుకోవడానికి, మామిడి తోటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏ రాయచోటి మున్సిపల్ ఛైర్మన్‌కు డబ్బు ఆశ చూపించారో అదే పట్ణణానికి పలు అభివృద్ధి పనుల కింద రూ.340 కోట్లు మంజూరు చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు.

Also Read:'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'.. వెతికిపెట్టమంటున్న మహిళలు!

వక్ఫ్‌బోర్డు, విద్యాశాఖల మధ్య నెలకొన్ని వివాదాన్ని పరిష్కరించేందుకు గాను 4 ఎకరాల భూమిని ముస్లింలకు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పట్టణంలో ఉన్న ప్రభుత్వాసుపత్రిని 100 పడకలకు మారుస్తున్నట్లు జగన్ వెల్లడించారు. 

ఒక రూపాయి ఖర్చు లేకుండా రాజధాని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేశామని బాబు అన్నారు. అసెంబ్లీయో, హైకోర్టో ఉంటే అభివృద్ధి జరగదని చంద్రబాబు సోమవారం అమరావతిలో స్పష్టం చేశారు.

మౌలిక సదుపాయాలు కల్పిస్తే వచ్చే పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఆధునిక నగరం వస్తోందని అమరావతిని ప్రపంచమంతా పొగిడిందని బాబు వెల్లడించారు. డబ్బులేవంటూ అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూస్తున్నారని టీడీపీ చీఫ్ ఆరోపించారు.

రాజధానిపై సీఎం జగన్ ఉన్నట్లుండి ఎందుకు మాట మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వాళ్లు జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలని ప్రతిపక్షనేత డిమాండ్ చేశారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిని చంపేయాలని చూడటం దారుణమన్నారు.