అమ్మ రాజీనామా... వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. 

YS Vijayamma Resigns To YSRCP Honorary president Post


గుంటూరు: వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా వైఎస్ విజయమ్మ  ప్రకటించారు.శుక్రవారం నాడు గుంటూరులో జిరిగిన వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో ఆమె తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.

తెలంగాణలో తన కూతురు వైఎస్ షర్మిల పార్టీని ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిల ప్రయత్నం చేస్తుందన్నారు. ఏపీలో మరోసారి జగన్ పార్టీని అధికారంలోకి  వస్తాడని ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.  ఈ ఇద్దరి బిడ్డలకు తల్లిగా అండగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్ భార్యగా రెండు రాష్ట్రాల్లో తాను ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు తనను అంగీకరిస్తారన్నారు. వక్రీకరణలకు, కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు ఉన్నాయనే ప్రచారానికి తావివ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.

తాను రాయని చేయని సంతకం పేరుతో సోషల్ మీడియాలో రాజీనామా లేఖ ప్రత్యక్షం కావడాన్ని ఆమె ప్రస్తావించారు.ఈ లేఖలో జగన్ కు వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ లేఖలో పిచ్చి రాతలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను చూస్తే వారి దిగజారుడుతనం కన్పిస్తుందన్నారు. ఈ లేఖను చూస్తే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని కూడా అన్నించిందన్నారు.

 ఈ లేఖను తాను చూసిన సమయంలో ఎంతో బాధ పడినట్టుగా ఆమె చెప్పారు.  తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, ఆడ, మగ అనే తేడా లేకుండా నిందలు వేశారని ఆమె మండిపడ్డారు. తాను రాయని లేఖను సోషల్ మీడియాలో ఎలా విడుదల చేస్తారని ఆమె ప్రశ్నించారు. తాను వినకూడని మాటలు కూడా విన్నానని చెప్పారు.వైఎస్ఆర్‌సీ‌పీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకొంటున్నట్టుగా విజయమ్మ వివరించారు.ఈ సమయంలో ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.

తెలంగాణలో  వైఎస్ షర్మిలమ్మ ఒంటరి పోరాటం చేస్తుందన్నారు. ఈ సమయంలో షర్మిలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో తాను తన కొడుకుకు అండగా ఉన్నానని ఆమె గుర్తు చేసుకున్నారు. జగన్ సంతోషంగా ఉన్న  సమయంలో తెలంగాణలో ఒంటరిగా ఉన్నషర్మిలకు అండగా నిలబడకపోతే ఆమెకు అన్యాయం చేసినట్టు అవుతుందని భావించి వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి వైదొలుగుతున్నట్టుగా ఆమె వివరించారు.

తన ఉనికి ఎవరికి వివాదాస్పదం, అభ్యంతరం కాకూడదనే ఉద్దేశ్యంతోనే  తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విజయమ్మ చెప్పారు.వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటున్నందుకు తనను క్షమించాలని కూడా ఆమె కోరారువైఎస్ఆర్ లేని లోటును తనకు ఎవరూ తీర్చలేరన్నారు. కానీ ేపీలో వైఎస్ జగన్, తెలంగాణలో వైఎస్ షర్మిల ఈ లోటును తీరుస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. 

also read:నల్లకాలువలో ఇచ్చిన హామీ మేరకే పార్టీ:వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ

నా బిడ్డలను మీకు అప్పగించాను, వారికి మీరు అండగా ఉండాలి, వారికి మీరు బలం కావాలని ఆమె కోరుకున్నారు. నా బిడ్డలు కూడా మీకు అండ, బలం అవుతారని ఆమె ప్రజలకు  చెప్పారు.వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకుంటున్నా కూడా తల్లిగా జగన్ కు, వైఎస్ఆర్ భార్యగా  మీ మనస్సులకు దగ్గరగానే ఉంటానని ఆమె చెప్పారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios