భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.  పునరావాస కేంద్రాల నుండి బాధితులు ఇంటికి వెళ్లే సమయంలో రూ. 2 వేలు చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. 

అమరావతి: Heavy Rains నేపథ్యంలో అవసరమైన చోట పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం YS Jagan అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల విషయమై అధికారులతో సీఎం జగన్ మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు.భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. 

Godavariకి ముందస్తుగానే వరదలు వచ్చాయని CM గుర్తు చేశారు. జూలైలో 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందన్నారు. రేపు ఉదయానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 

Flood పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధకారులు సిద్దంగా ఉండాలన్నారు. Maharashtra లో భారీ వర్షాలతో గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని సీఎంజగన్ చెప్పారు. అవసరమైన చోట కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమర్ధవంతంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. . వరదలు వచ్చే అవకాశం ఉన్న చోట్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

అవసరమైన చోట పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ శిబిరాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో బాధితులకు రూ. 2 వేలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు . పీహెచ్‌సీ, ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కూడా సీఎం వైద్య ఆరోగ్య శాఖాధికారులను కోరారు. తాగునీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.

Bay of Bengal లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ రాష్ట్రానికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో వరద పోటెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కారణంగా వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ధవళేశ్వరంలో 13 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందన్నారు. : ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోంని సీఎం చెప్పారు.రేపు ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గోదావరిలో వరద ప్రవాహం 15 నుంచి 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని సీఎం చెప్పారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. వరదల కారణంగా రాష్ట్రంో ఒక్కరూ కూడా మరణించకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 

also read:ఒడిశాలో చిక్కుకున్న మత్స్యకారులు: గంజాం పోర్టులోకి అనుమతివ్వాలంటున్న విశాఖవాసులు

కూనవరం, చింతూరుల్లో 2 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయన్నారు. వెంకటాపురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని సీఎం చెప్పారు. 24 గంటలపాటు నిరంతరాయంగా కంట్రోల్‌ రూంలు పనిచేయాలని సీఎం సూచించారు. 

లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని వెంటనే పునరావాస శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లోమంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.బాధితుల పట్ల మానవతాదృక్ఫధంతో మెలగాలన్నారు. 

నిత్యావసర సరుకులకు సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారుఅవసరమైన సరుకులు నిల్వ ఉంచేలా చూసుకోవాలన్నారు. పారిశుధ్యం బాగుండేలా చర్యలు తీసుకోవాలి:తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులునడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని సీఎం అధికారులను కోరారు. తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాల్సిందిగా కోరారు. 

చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అల్లూరు సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు రూ.2కోట్ల చొప్పున తక్షణ నిధులు ఇస్తున్నట్టుగా సీఎం వివరించారు. సీఎంఓ అధికారులు మీకు అందుబాటులో ఉంటారన్నారు.వరద కారణంగా జరిగిన నష్టాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించి రోజువారీ నివేదికలు పంపాలని సీఎం ఆదేశించారు.