Asianet News TeluguAsianet News Telugu

ఈ నెల 14న గడప గడపకుపై జగన్ సమీక్ష.. సీఎంకు చేరిన ప్రొగ్రెస్ రిపోర్ట్, ఎమ్మెల్యేల్లో టెన్షన్

ఈ నెల 14న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్  ప్రత్యేక  సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే సీఎంకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదికలు అందజేసింది ఐప్యాక్ టీమ్. దీంతో ఆ రోజున జగన్ ఎవరికి క్లాస్ పీకుతారోనని ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. 
 

ap cm ys jagan review on gadapa gadapaku mana prabhutvam on december 14th
Author
First Published Dec 10, 2022, 3:19 PM IST

వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకోవాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా సిద్ధంగా వుండేలా శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నేతలతో సమావేశమైన ఆయన దిశానిర్దేశం చేశారు. తాజాగా .. ఈ నెల 14న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్  ప్రత్యేక  సమీక్ష నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వడంతో పాటు పరిశీలకులతో జరిగిన సమావేశం వివరాలను జగన్ వివరించనున్నారు. 

ఇప్పటికే సీఎంకు ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి నివేదికలు అందజేసింది ఐప్యాక్ టీమ్. నివేదికలో అంశాలు ఎమ్మెల్యేల పనితీరును  వివరించనున్నారు సీఎం. బహుశా గడప గడపకుపై ఇదే చివరి సమీక్ష అయ్యే అవకాశం వుందని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే సుమారు 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ALso REad:పనిచేస్తున్నారో లేదో , నా మనుషుల నిఘాలోనే .. మీ వల్లకాకుంటే : నేతలకు జగన్ హెచ్చరికలు

అంతకుముందు గురువారం వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, అన్ని నియోజకవర్గాల పరిశీలకులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా పని చేయాలని.. పని చేయలేకపోతే ముందే చెప్పేయాలని జగన్ తేల్చేశారు. మీరు పనిచేస్తున్నారో లేదో పర్యవేక్షించడానికి తన మనుషులు వుంటారని, మీరు పనిచేయకపోతే మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. పని చేసినవాళ్లకు తగిన గుర్తింపు వుంటుందని జగన్ తెలిపారు. 

ఇక ఇదే సమావేశంలో.. 5 లక్షల 20 వేల మంది గ్రామ సారథులను నియమించాలని పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్‌కి ఇద్దరు గ్రామ సారథులు వుండాలని.. ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం చేపట్టాలని జగన్ సూచించారు. 50 కుటుంబాలను ఒక క్లస్టర్‌గా గుర్తించాలని సీఎం ఆదేశించారు. బూత్ కమిటీలను 10 రోజుల్లో పూర్తి చేయాలని.. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు నాయకుల మానిటరింగ్ బాధ్యతల్ని అప్పగించాలని జగన్ సూచించారు. ఇద్దరిలో ఒక మహిళా నాయకురాలు, ఒక నాయకుడు వుండాలన్నారు. ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యతను అబ్జర్వర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios