వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావుండకూడదని సీఎం ఆదేశించారు. 

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వేలో ఎక్కడా అవినీతికి తావుండకూడదని సీఎం ఆదేశించారు.

ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకూడదని జగన్ సూచించారు. ప్రతి చోటా చెకింగ్ పక్కాగా వుండాలని, అలసత్వం చూపొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. గ్రామస్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు కావాలని.. సర్వే ప్రక్రియ సజావుగా జరిగేలా స్టీరింగ్ కమిటీ వుంటుందని జగన్ తెలిపారు. సీసీఎల్‌ఏకు వారానికి ఒకసారి రివ్యూ చేసే కీలక బాధ్యత అప్పగిస్తామని సీఎం చెప్పారు. 

Also Read:వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం... ప్రారంభించిన సీఎం జగన్

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూ రక్షను వైఎస్ జగన్ గతేడాది కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రాష్ట్రంలో 1920-27 మధ్యలో భూముల సర్వే జరగ్గా.. ఉమ్మడి రాష్ట్రంలో 2004-08 మధ్య భూభారతి పేరుతో ప్రారంభించినా, అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత భూధార్‌ పేరుతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టారు.. కానీ అది కూడా పూర్తికాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా హైబ్రిడ్‌ పద్ధతిలో కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్సు స్టేషన్స్‌ (కార్స్‌) విధానంలో జీపీఎస్‌ అనుసంధానంతో ఈ సర్వే చేయనున్నారు. సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో డ్రోన్‌ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ, వ్యవసాయేతర భూములను సర్వే చేసి కచ్చితత్వంతో పట్టాలు రూపొందించి శాశ్వత హక్కు కల్పిస్తారు. మూడేళ్ల తర్వాత పూర్తి హక్కులు లభిస్తాయి.