ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు తగ్గాయన్నారు సీఎం వైఎస్ జగన్. బెల్టు షాపుల్ని తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దు వల్లే ఇది సాధ్యమైందని.. రాష్ట్ర ఆదాయం పెరిగేలే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని జగన్ సూచించారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సోమవారం ఆదాయాన్నిచ్చే శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్టు షాపుల్ని తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దుతో మద్యం విక్రయాలు తగ్గాయని జగన్ అన్నారు. ధరల పెంపు కూడా మద్యం అమ్మకాలు తగ్గడానికి కారణమైందని... అక్రమ మద్యం తయారీ, అమ్మకాలపై ఎస్ఈబీ నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పన్ను చెల్లింపుదారులకు మరింత అవగాహన కల్పించాలని జగన్ సూచించారు. పన్ను ఎగవేసే సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అలాగే పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అక్రమాలు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర ఆదాయం పెరిగేలే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని జగన్ సూచించారు.
అంతకుముందు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాని మోడీ సభలో జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది దిశగా ముందుకెళ్తోందని చెప్పారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. రూ. 10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ధన్యావాదాలు తెలిపారు.
ALso Read:మాకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా లేదు.. కేంద్రం మరింతగా సహకరించాలి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే.. ప్రతి ఇళ్లు కూడా నిలదొక్కుకోవడం అని నమ్మి అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మరింతగా సహకారం అందించాలని ప్రధాని మోదీని కోరారు. విభజన గాయాల నుంచి ఏపీ పూర్తిగా కోలుకోలేదని అన్నారు. సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పనర్ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే ప్రతి పనిని ఇక్కడ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం అని తెలిపారు. తమకు రాష్ట్ర ప్రయోజనాల తప్ప మరొక అజెండా ఉండదని చెప్పారు.
విభజన హామీల నుంచి ప్రత్యేక హోదా, పోలవరం వరకు, స్టీల్ ప్లాంట్ నుంచి పోలవరం వరకు... పలు సందర్భాల్లో చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని పెద్దమనుసుతో వాటిని పరిష్కారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మంచి చేసే తమ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు, పెద్దలైన మోదీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు.
