Asianet News TeluguAsianet News Telugu

అటానమస్‌ కాలేజీలకు చెక్.. అంతా జేఎన్టీయూ కనుసన్నల్లోనే: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సొంతంగా ప్రశ్నాపత్రాలు  తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ap cm ys jagan review meeting on education system ksp
Author
Amaravathi, First Published Mar 25, 2021, 7:17 PM IST

విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అటానమస్, నాన్ అటానమస్ కాలేజీలకు జేఎన్టీయూ ప్రశ్నాపత్రాలే ఉండాలని తెలిపింది. వాల్యుయేషన్ కూడా జేఎన్టీయూకే అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యం లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేరని .. ప్రతి విద్యార్థీ నైపుణ్యంతో, సబ్జెక్టుల్లో పరిజ్ఞానంతో ముందుకు రావాలి ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ప్రతికోర్సుల్లో అప్రెంటిస్‌ విధానం తీసుకురావాలని అందుకే నిర్ణయించామని.. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు విలువ ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. విద్యార్థులు తాము చదువుతున్న కోర్సుల్లో నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలని సీఎం అన్నారు.

కొత్త కొత్త సబ్జెక్టులను వారికి అందుబాటులో ఉంచాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్రీ విద్యా విధానాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విశాఖపట్నంలో మంచి డిగ్రీ కాలేజీ తీసుకురావాలని, ఆర్ట్స్‌లో మంచి సబ్జెక్టులను ఈ కాలేజీలో ప్రవేశపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios