Asianet News Telugu

ఆక్వా యూనివర్సిటీ పనుల్లో వేగం పెంచండి..: అధికారులకు సీఎం జగన్ ఆదేశం

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారలకు పలు కీలక ఆదేశాలిచ్చారు. 

AP CM YS Jagan Review Meeting on Aqua Department akp
Author
Amaravati, First Published Jul 14, 2021, 4:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. యూనివర్సిటీ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని... భూసేకరణపనులుపై మరింత ధ్యాస పెట్టాలన్నారు.  కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారలకు పలు కీలక ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలన్నారు. సరసమైన ధరలకే మత్స్య ఉత్పత్తులు ప్రజలకు చేరాలని... ఈ లక్ష్యాలను చేరుకునేందుకే ఆక్వాహబ్‌ల ఏర్పాటు జరగాలన్నారు. ఇటు రైతులకు, అటు వినియోగదారులకు మేలు చేయడానికే ఆక్వాహబ్‌లు తీసుకు వచ్చామన్నారు. ఆక్వాహబ్‌లు, వాటికి అనుబంధంగా రిటైల్‌ దుకాణాల వివరాలను అందించారు అధికారులు. 

''ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్స్‌ మీద బాగా ప్రచారం చేయాలి. వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. సీడ్, ఫీడ్‌ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా ఉండాలి. ఆక్వా రంగానికి సంబంధించి క్వాలిటీ చెకింగ్స్‌ ఎలా చేయించుకోవాలన్నదానిపై అందరికీ సమాచారం తెలియాలి. 35 ల్యాబ్స్‌లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా, మరో 21 ల్యాబ్స్‌ నవంబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ఆక్వాకల్చర్‌ ల్యాబ్‌లను ఆర్బీకేలకు అనుసంధానం చేయాలి'' అని సీఎం ఆదేశించారు. 

 ఫిషింగ్‌ హార్భర్లు,  ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల పనులు ప్రగతిపైనా సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో 7 ఫిషింగ్‌ హార్భర్లు, 5 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లలో పనుల ప్రగతిపై సమీక్షించారు. 5 ఫిషింగ్‌ హార్బర్లు, 1 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌లో పనుల ప్రారంభమయ్యాయని అధికారులు తెలపగా మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

read more  ప్రజాకోర్టులో సీఎం జగన్ కు రూ.1000 జరిమానా... వెంటనే చెల్లించాలి: గోరంట్ల డిమాండ్ (వీడియో)

''కేజ్‌ ఫిష్‌ కల్చర్, మరీకల్చర్‌లపై దృష్టి పెట్టాలి... వీటితో ఆదాయాలు బాగా పెరుగుతాయి. కేజ్‌ ఫిష్‌ కల్చర్‌కు సంబంధించి పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయండి. దీనిపై రైతులు, ఔత్సాహికులను కలిపి ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించండి. పైలెట్‌ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్‌ ఫిష్‌ కల్చర్‌ మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు.

పశుసంవర్ధక శాఖపైనా సీఎం సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని వెటర్నరీ డిస్పెన్సరీల్లో హేతుబద్ధత ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో ఏముండాలి? మండల కేంద్రంలో ఏముండాలి? అన్నది నిర్ధారించాలని ఆదేశించారు. గ్రామం, మండలం, నియోజకవర్గ స్ధాయిలో ఏయే డిస్పెన్షరీలు ఉండాలన్నదానిపై హేతుబద్ధత ఉండాలన్నారు. దానిపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించి సీఎంకు వివరాలు అందించిన అధికారులు. ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పాలవెల్లువ ప్రారంభంకాగా ఆగష్టు నెలలో ఏపీ అమూల్‌ను విశాఖపట్నం, అనంతపురము జిల్లాలకు విస్తరిస్తున్నట్లు సీఎం జగన్ కు తెలిపారు అధికారులు.

ఈ సమీక్షా సమావేశానికి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవియస్‌ నాగిరెడ్డి, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖల స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ ఎండీ ఎ బాబు, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఆర్‌ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios