అమరావతి: విజయవాడలో కరోనా పేషెంట్స్ కి చికిత్స అందిచేందుకు ఉపయోగిస్తున్న ఓ హోటల్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆయన అధికారుల వద్ద ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. 

ఒక ప్రైవేటు ఆస్పత్రి ఈ హోటల్‌ను లీజుకు తీసుకుందని... అందులో కరోనా వైరస్‌ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎం జగన్ కు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

read more   బ్రేకింగ్... విజయవాడ కోవిడ్ సెంటర్ లో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి (వీడియో)

ఈ అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి మేకతోటి సుచరిత కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా చికిత్స పొందుతున్న వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరమని...ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని హోమంత్రి అధికారులకు సూచించారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. ఈ ప్రమాద ఘటనపై అన్ని ఆధారాలను సేకరించాలని అధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశించారు.