రాష్ట్రంలో వైషమ్యాలకు టీడీపీ యత్నం: వైఎస్ జగన్
రాష్ట్రంలో వైషమ్యాలకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.
అమరావతి:అసభ్యకర మాటలతో రాష్ట్రంలో వైషమ్యాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఏపీ సీఎం ys Jagan టీడీపీపై విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
also read:AP Bandh: రోడ్డెక్కితే చాలు... ఎక్కడికక్కడ టిడిపి శ్రేణుల అరెస్టులు (ఫోటోలు)
బుధవారం నాడు జగనన్న తోడు పథకం కింద 4,50,546 మంది చిరు వ్యాపారులకు రూ.16.36 కోట్ల వడ్డీని ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా ఏపీలో Tdp కార్యాలయంపై దాడి ఘటనపై సీఎం జగన్ ఈ సందర్భంగా స్పందించారు. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేకే కొందరు బూతులు తిడుతున్నారన్నారు. పేదలకు మేలు జరిగితే ఎక్కడ తనకు పేరు వస్తోందో అని కుట్రలకు తెర లేపారని ఆయన టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీరెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుందని ఆయన మండిపడ్డారు.
ఆ బూతులు విని తట్టుకోలేక కొందరు అభిమానులు ఆవేశాలకు లోనవుతున్నారన్నారు.ఎవరూ మాట్లాడని బూతులను ప్రతిపక్షం మాట్లాడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము కూడా ఉపయోగించలేదన్నారు.
ప్రతిపక్షం ఎలా తయారైందో ప్రజలు చూస్తున్నారన్నారు.బూతులు తిడుతూ ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మంచి పనులు ఆపడానికి రకరకాల ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షానికి మీడియాలోని ఓ వర్గం కూడా తోడైందని ఆయన మండిపడ్డారు.వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం కూడా సాగుతోందన్నారు.
చిరు వ్యాపారులకు అండ
Jagananna thodu పథకం కింద 4,50,546 మంది చిరు వ్యాపారులకు రూ.16.36 కోట్ల వడ్డీని ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన వ్యాపారులకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. దీంతో చిరు వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది.
చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు గాను జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు జగన్.చిరు వ్యాపారులకు బ్యాంకుల నుండి ఎప్పుడూ కూడ సహకారం అందలేదన్నారు సీఎం.గత ప్రభుత్వాలు కూడ చిరు వ్యాపారులను పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే చిరు వ్యాపారులు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించేవాళ్లన్నారు.తన పాదయాత్ర సందర్భంగా చిరు వ్యాపారుల కష్టాల్ని తెలుసుకొన్నానని జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అందుకే చిరు వ్యాపారుల కోసమే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించామని జగన్ వివరించారు. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ. 905 కోట్లు పంపిణీ చేశామన్నారు సీఎం.
ప్రతి ఏటా రెండు దఫాలు జగనన్న తోడు కార్యక్రమం కింద నిధులు అందిస్తామని సీఎం చెప్పారు. ప్రతి ఏటా డిసెంబర్, జూన్ మాసాల్లో లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.ఇప్పటివరకు ఓవర్ డ్యూ ఉన్న లబ్దిదారులు బ్యాంకర్లకు డబ్బులు చెల్లిస్తే డిసెంబర్ మాసంలో ప్రభుత్వం వడ్డీని లబ్దిదారులకు అందించనుందని సీఎం హామీ ఇచ్చారు. ఓవర్ డ్యూ ఉన్న లబ్దిదారుల విషయంలో చూసీ చూడనట్టుగా ఉండాలని ఆయన బ్యాంకర్లను కోరారు.