అమరావతి: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగని దిశ  హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ పై ఏపి సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా స్పందించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ లో తప్పేమీలేదని... తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల చర్యను తాను సమర్తిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో జాతీయ మానవ హక్కుల కమీషన్ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. వారి వ్యవహారతీరు బాలేదని జగన్ అభిప్రాయపడ్డారు. 

దిశ నిందితులను కాల్చివేయడాన్ని సమర్థిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హ్యాట్సాఫ్ తెలిపారు జగన్. ప్రస్తుతమున్న చట్టాలు మారాలని...  మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలని సూచించారు.  వెంటనే చట్టాలు మార్చితే మహిళలపై దాడులు తగ్గే అవకాశాలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. 

అంతకుముందు మహిళా రక్షణపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హోమంత్రి మేకతోటి సుచరిత వివరించారు. ఏపీ పోలీస్, శిశుసంక్షేమ శాఖలు మహిళల రక్షణ, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయన్నారు.  ప్రభుత్వం 11వేల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, 3వేల వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శిలను మొత్తం 14వేల పదవులను నోటిఫై చేయటం జరిగిందన్నారు.  గత శనివారం నాటికి నాటికి ఈ ఉద్యోగాల్లో 9,574 మంది చేరారని తెలిపారు. 

read more ప్రజలేమైనా సరే...హెరిటేజ్ లాభపడితే చాలా: చంద్రబాబుకు బుగ్గన చురకలు

2,271 మందితో కూడిన మొదటి బ్యాచ్‌ను 9.12.2019 నుండి 23.12.2019 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో శిక్షణకు పంపటం జరుగుతుందని మంత్రి వివరించారు. కార్యదర్శులు శిక్షణ పొందేవరకు ఈ శిక్షణ కొనసాగుతుందన్నారు. గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను సచివాలయాల్లో నియమించటం జరిగిందన్నారు. దీనివల్ల పోలీసు సేవలు మెరుగుపడటం జరుగుతుందని సుచరిత అన్నారు. 

ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అంతేగాక సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించటం జరుగుతుందని సుచరిత వివరించారు. 

read more వైసీపీ ఎంపీపై రేప్ కేసు: జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు

మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా మహిళా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటానికి ఏపీ డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. 

ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై నేరాల పరిష్కారం కోసం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. వీటికి అదనంగా 2019 అక్టోబర్‌ 2 నుంచి పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.

"