Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎంపీపై రేప్ కేసు: జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావాలని అనుకోవడం మంచిపరిణామమన్నారు. 
 

ap winter assembly sessions: Tdp president chandrababu praises YS Jagan government
Author
Amaravati Capital, First Published Dec 9, 2019, 2:16 PM IST

అమరావతి: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావాలని అనుకోవడం మంచిపరిణామమన్నారు. 

మహిళ భద్రత విషయంలో ఎలాంటి జగన్ ప్రభుత్వం ఎలాంటి చట్టాలను తీసుకువచ్చినా తమ మద్దతు ఉంటుందని తెలిపారు చంద్రబాబు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రత విషయానికి చట్టం తేవడం కాదని దాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. 

మహిళల భద్రత విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ నేతలు దారుణమైన ఆరోపనలు చేశారని చెప్పుకొచ్చారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలను చెప్తూనే ఉన్నారని కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా అనేక దారుణాలు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. 

వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా అత్యాచారాలు, హత్యలు కూడా జరిగాయని గుర్తు చేశారు. ఇకపోతే వైసీపీ నేతలు సైతం అత్యాచారానికి పాల్పడి వారిని హత్య చేసిన దాఖలు లేవన్నారు. 

mla roja: గన్ వచ్చే లోపు జగన్ అన్న వస్తాడు.. బాహుబలి సీన్ ను వివరించిన ఎమ్మెల్యే రోజా...

ఇకపోతే ప్రకాశం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ బాజీ అనే కార్యకర్త మరో ఐదుగురితో కలిసి దారుణంగా ఒక మైనర్ బాలికను అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ కేసు ఏమైందో తెలియదన్నారు చంద్రబాబు.  

అనంతపురం జిల్లాలో వైసీపీ నేతల ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి భర్తను ఇంట్లో కట్టేసి అతని ఎదురుగానే భార్యపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారంటూ చంంద్రబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనలో వైసీపీ వాలంటీర్ మహిళపై దారుణానికి ఒడిగట్టారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 

ఇకపోతే హిందుపురం ఎంపీ మాధవ్ పై కూడా అత్యాచారం కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పులను పదేపదే ఎత్తిచూపితే తాము కూడా ఎత్తిచూపగలమన్నారు. 

లోకేష్ పప్పులో ఉల్లి లేదనే చంద్రబాబు బాధ: బాలకృష్ణపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా

మహిళలపై దాడులకు పాల్పడిన వారిని ఎవరినీ ఉపేక్షించవద్దని అందుకు తనవంతు సాయం చేస్తానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్భయ చట్టం అమలులో ఉన్నా దాన్ని అమలులో లోపాలు ఉన్నాయన్నారు. నిర్భయచట్టం సరిగ్గా అమలు కావడం లేదన్నారు.

మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చట్టాలను తీసుకువచ్చినా తాము అండగా ఉంటామని సూచించారు. నూతన చట్టాలను తీసుకువస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో జాతీయ స్థాయిలో చట్టాలను కూడా పరిశీలించాలని సూచించారు. అందుకు తాము సహకరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా

Follow Us:
Download App:
  • android
  • ios