గుంటూరు: ఒడిలో చిన్నారులను కూర్చోబెట్టుకొని అక్షరాలను దిద్దించారు ఏపీ  సీఎం వైఎస్ జగన్. శుక్రవారంనాడు  గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో  రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడ విద్యార్థులతో అక్షరాలను దిద్దించారు. అదే తరహలోనే జగన్ కూడ విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు.

అసెంబ్లీ వాయిదా పడిన రాజన్న బడిబాట కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. సుమారు రెండువేల మంది విద్యార్థులతో సామూహిక అక్షరభాస్యం చేయించారు. కొందరు విద్యార్థులను వరుసగా తన ఒడిలో కూర్చొబెట్టుకొని సీఎం జగన్  అక్షరాలను దిద్దించారు.

తమ పిల్లలతో సీఎం జగన్ అక్షరాలు దిద్దించడంతో  తల్లిదండ్రులు సంతోషపడ్డారు. అక్షరాలను దిద్దిన విద్యార్థులకు సీఎం జగన్ బహుమతులు అందించారు.