వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్థీవదేహానికి సీఎం జగన్ నివాళులు: కుటుంబ సభ్యులకు ఓదార్పు

వైసీపీ  ఎమ్మెల్సీ  చల్లా భగీరథరెడ్డి   బౌతిక కాయానికి  ఏపీ సీఎం  వైఎస్ జగన్  గురువారంనాడు  నివాళులర్పించారు.అనారోగ్యంతో  చల్లా  భగీరథరెడ్డి  నిన్న మరణించిన  విషయం తెలిసిందే.

 AP CM YS Jagan  Pays  Tributes  To  MLC Challa  Bhageerath Reddy  dead body

నంద్యాల:: అనారోగ్యంతో  ఆసుపత్రిలో చికిత్స  పొందుతూ మృతి  చెందిన ఎమ్మెల్సీ  చల్లా భగీరథ రెడ్డి  భౌతిక  కాయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్  గురువారంనాడు  నివాళులర్పించారు. 

హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి బుధవారంనాడు మృతి  చెందారు.  భగీరథరెడ్డి భౌతిక కాయాన్ని స్వగ్రామం ఉప్పలపాడుకు తరలించారు.  ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ఉప్పలపాడుకు  చేరుకుని  భగీరథ రెడ్డి బౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ తర్వాత  భగీరథ రెడ్డి కుటుంబ సభ్యులను సీఎం  ఓదార్చారు. చల్లా భగీరథరెడ్డికి  చెందిన ఫాం హౌస్ లో  రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి తనయుడే చల్లా భగీరథ రెడ్డి ,రెండేళ్ల క్రితం చల్లా  రామకృష్ణారెడ్డి  మృతి చెందారు. తండ్రి మరణించిన రెండేళ్లకే  భగీరథ రెడ్డి మృతి చెందడంతో విషాదం నెలకొంది.చల్లా రామకృష్ణారెడ్డి కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలలో  పనిచేశారు. చల్లా  రామకృష్ణారెడ్డి  మరణంతో  భగీరథరెడ్డికి  సీఎం  జగన్  ఎమ్మెల్సీ పదవిని  ఇచ్చారు.  అయితే అనారోగ్యంతో  భగీరథ రెడ్డి  మరణించారు.

also read:అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి మృతి

1983లో చల్లా రామకృష్ణారెడ్డి పాణ్యం అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా  విజయం సాధించారు..1999,2004 ఎన్నికల్లో కోవెలకుంట్ల  నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. .2009 లో పీఆర్పీ అభ్యర్ధి కాటసాని రాంరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.2014లో చల్లా రామకృష్ణారెడ్డి  టీడీపీలో  చేరారు. బనగానపల్లె  నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీసీ  జనార్ధన్  రెడ్డి విజయం కోసం కృషి  చేశారు. దీంతో ఆయనకు చంద్రబాబు ఏపీ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మెన్ పదవిని  కట్టబెట్టారు. .2019  ఎన్నికల సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios