వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి బుధవారం నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి అస్వస్థతతో చికిత్స పొందుతూ బుధవారంనాడు మృతి చెందాడు. భగీరథరెడ్డిది ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆవుకు మండలం ఉప్పలపాడు గ్రామం. రేపు ఆవుకులో చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.రేపు జరిగే చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు.అనారోగ్యంతో చల్లా భగీరథ రెడ్డి హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచాడు.
మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడే చల్లా భగీరథ రెడ్డి.రామకృష్ణారెడ్డి వారసుడిగా భగీరథ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి ఆకస్మికంగా మరణించడంతో ఆయన తనయుడు భగీరథ రెడ్డికి జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలలో పనిచేశారు.
1983లో చల్లా రామకృష్ణారెడ్డి పాణ్యం అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు..1999,2004 ఎన్నికల్లో కోవెలకుంట్ల నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2009లో పీఆర్పీ అభ్యర్ధి కాటసాని రాంరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.2014లో చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీలో చేరారు. బనగానపల్లె నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన బీసీ జనార్ధన్ రెడ్డి విజయం కోసం కృషి చేశారు.ఏపీ సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మెన్ చల్లా రామకృష్ణారెడ్డి పనిచేశారు.2019 ఎన్నికల సమయంలో చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. రామకృష్ణారెడ్డ మరణంతో భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఆ పార్టీ నాయకత్వం కట్టబెట్టింది.
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చల్లా భగీరథ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.తండ్రి మరణించిన రెండేళ్లకే భగీరథ రెడ్డి మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
