దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్ తనయుడు, ఏపీ సీఏం జగన్‌మోహన్ రెడ్డి నివాళులర్పించారు.

పులివెందుల నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్,  అవినాష్ రెడ్డి, మంత్రి కురసాల కన్నబాబుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.