Asianet News TeluguAsianet News Telugu

దసరా ఉత్సవాలు: బెజవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం జగన్


ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో  దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.

AP CM YS Jagan offers silk robes to Kanaka durgamma
Author
Vijayawada, First Published Oct 12, 2021, 3:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ys jagan మంగళవారం నాడు vijayawada kanaka durga అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఇవాళ ఉదయమే తిరుపతి నుండి అమరావతికి చేరుకొన్నారు. 

also read:తిరుమల శ్రీవారి సన్నిధిలో జగన్ కు తులాభారం... మొక్కుతీర్చుకున్న సీఎం (ఫోటోలు)

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్బవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం జగన్  silk robes సమర్పించారు. 

ఆలయ సంప్రదాయం ప్రకారంగా అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం కట్టి తలపాగా చుట్టారు. పట్టు వస్త్రాలను సీఎం జగన్ వేద మంత్రాల సాక్షిగా పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సమయంలో దుర్గమ్మ ఆలయ పరిసరాల్లో వర్షం కురిసింది. 

ఇవాళ  కనకదుర్గమ్మ అమ్మవారు సరస్వతీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.  సీఎం జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.సీఎం జగన్ వెంట ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,  దేవాదాయశాఖాధికారులు, విజయవాడ మున్సిపల్ అధికారులు కూడ ఉన్నారు.

సీఎం జగన్ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఇవాళ భారీ ఎత్తున భక్తులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకొన్నారని అధికారులు తెలిపారు.ఇవాళ మూలా నక్షత్రం  కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొన్నారు.  మూలా నక్షత్రం రోజున వర్షం పడడం శుభసూచికమని వేద పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios