అమరావతి: మధ్యం అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడుస్తానని మాట ఇచ్చాను అని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. మద్యం నిషేధం దిశగా అడుగులేస్తూ బెల్టుషాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తీసుకు వచ్చినట్లు జగన్ తన ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగించడం ద్వారా గ్రామాల్లో బెల్టు షాపులు పూర్తిగా మూతపడతాయని జగన్ స్పష్టం చేశారు.