Asianet News TeluguAsianet News Telugu

విశాఖకు ఎగ్జిక్యూటివ్ కేపిటల్.. తెర వెనుక తరలిపోతోందా, వైసీపీ నేతల వ్యాఖ్యలకు అర్థమదేనా..?

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని ఈ ఏడాది చివరి నాటికి తరలిపోనుందా..? వివిధ శాఖల దస్త్రాలు రెడీ అవుతున్నాయా..? అధికారులు కూడా అందుకు అనుగుణంగా విశాఖకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ap cm YS Jagan Mohan Reddy likely to shift base to Vizag in few months ksp
Author
Amaravathi, First Published Jun 18, 2021, 9:59 PM IST

ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని ఈ ఏడాది చివరి నాటికి తరలిపోనుందా..? వివిధ శాఖల దస్త్రాలు రెడీ అవుతున్నాయా..? అధికారులు కూడా అందుకు అనుగుణంగా విశాఖకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారా.? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపుపై వైసీపీ సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది. ఈ ఏడాది చివరి నాటికి విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది వైసీపీ సర్కార్.

మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగనున్నాయి. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా ఆంధ్రా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతామని జగన్ అసెంబ్లీలో చెప్పారు. విశాఖ నుంచి వీలైనంత త్వరగా పరిపాలన సాగించేందుకు అధికారులు కూడా రెడీ అయ్యారు.

Also Read:డిసెంబర్‌లోపే ముహూర్తం.. జగన్‌ని అడ్డుకోలేరు: విశాఖ రాజధానిపై గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలు

ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌కు కావాల్సిన భవనాల్లో కొన్ని ఎప్పుడో రెడీ అయ్యాయి. మరికొన్ని భవనాలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్ని సదుపాయాలు కంప్లీట్ చేయాలని వైసీపీ సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది. కుదిరితే డిసెంబర్ చివరి నాటికి లేదంటే అంతకన్నా ముందే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తరలిపోనుంది. మరోవైపు ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖకు తరలిపోతోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి ముహూర్తం నిర్ణయించకపోయినా త్వరలోనే పరిపాలన విశాఖ నుంచి సాగుతుందని స్పష్టం చేశారు.

అటు ఏ రోజైతే ఆర్ధికమంత్రి బుగ్గన ప్రకటించారో.. ఆరోజే తరలింపు ఫిక్స్ అయిపోయిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సమగ్ర అభివృద్ధే తమ పార్టీ నినాదమన్న ఆయన ఆనాటి నుంచే ప్రక్రియ ప్రారంభమైపోయిందన్నారు. సంకల్పం మంచిదైతే జరిగి తీరుతుందన్న బొత్స .. విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలన చేయవచ్చని స్పష్టం చేశారు.

Also Read:రాజధాని తరలింపులో కీలక ఘట్టం... విశాఖకు అధికార భాషా సంఘం కార్యాలయం: విజయసాయిరెడ్డి

విశాఖ నుంచి ముఖ్యమంత్రి పాలించడానికి ఎవరి అనుమతి అవసరం లేదని అమర్‌నాథ్ తేల్చిచెప్పారు. ఈ నిర్ణయాన్ని దేశంలో ఎవరూ అడ్డుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపే సీఎం విశాఖ నుంచి పాలన ప్రారంభించే అవకాశం వుందని అమర్‌నాథ్ చెప్పారు. ఆలస్యమైనా ఈ ఆర్ధిక సంవత్సరంలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. పరిపాలనకు సరిపడా మౌలిక సదుపాయాలు విశాఖలో ఉన్నాయని అమర్‌నాథ్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios