కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన కూలీల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సీఎం సూచించారు.

కాగా ఆదివారం ఉదయం కూలీలతో వెళుతున్న ఆటోను ఎదురుగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14మంది కూలీలుండగా ఐదురుగు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. మిగతా కూలీలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఇలా ప్రమాదానికి గురయిన కూలీలంతా నూజివీడు మండలం లైన్ తండాకు చెందినవారుగా తెలుస్తోంది. వీరంతా వరికుప్పల నూర్పిడి కోసం వేరే గ్రామానికి ఆటోలో వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
తెల్లవారుజామున ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక డిఎస్పి, సిఐ, ఎస్సై పరిశీలించి స్థానికులతో మాట్లాడి ప్రమాదం జరిగి తీరు గురించి తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి సమీపంలోని సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.