Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ నియోజకవర్గాలే టార్గెట్ : విజయవాడ ఈస్ట్‌పై జగన్ ఫోకస్..ఈసారి గెలిచి తీరాల్సిందే, కార్యకర్తలకు దిశానిర్దే

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈసారి అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 
 

ap cm ys jagan meets ysrcp leaders from vijayawada east assembly constituency
Author
First Published Jan 4, 2023, 4:02 PM IST

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ చేశారు. టార్గెట్ 175 దిశగా వ్యూహా రచన చేస్తున్న జగన్.. దీనిలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీయే గెలిచింది. దీంతో ఈసారి అక్కడ ఖచ్చితంగా గెలిచి తీరాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. 

మరోవైపు.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పార్టీలో వున్న అసంతృప్తులకు చెక్ పెట్టే పనిలో బిజీగా వున్నారు జగన్ . దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి షాకిచ్చారు. దీనిలో భాగంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు.

ALso REad: ఆనంపై వేటు.. వెంకటగిరి వైసీపీ ఇన్‌ఛార్జీ‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, హైకమాండ్ అధికారిక ప్రకటన

అలాగే బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, ఆమంచి వర్గాల మధ్య కూడా గత కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయతీకి చెక్ పెట్టారు జగన్. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. తద్వారా చీరాల ఇద్దరు నేతల మధ్య వున్న పంచాయతీకి చెక్ పెట్టడంతో పాటు వరుసగా రెండు సార్లు ఓడిపోయిన పర్చూరులో గెలవాలని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట్లో చీరాలను వదిలి వెళ్లడానికి ఆమంచి అంగీకరించలేదు. అయితే జగన్ నచ్చజెప్పడంతో ఆమంచి మనసు మార్చుకున్నారు.

కాగా.. అప్పటి ప్రకాశం జిల్లా చీరాల , పర్చూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున కరణం బలరాం, ఏలూరి సాంబశివరావులు గెలిచారు. అయితే తర్వాతి కాలంలో కరణం వైసీపీకి జైకొట్టారు. ఆయన కుమారు వెంకటేశ్ వైసీపీలో చేరగా.. చీరాల ఇన్‌ఛార్జ్ పదవిని కట్టబెట్టారు జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి కరణం వెంకటేశ్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అటు ఆమంచిని పర్చూరుకు వెళ్లాల్సిందిగా జగన్ తెలిపారు..అక్కడ బలంగా వున్న టీడీపీ నేత ఏలూరి సాంబశివరావును ఎదుర్కోవాలంటే కృష్ణమోహన్ అయితేనే కరెక్ట్ అని సీఎం భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూరులలో ఆమంచికి భారీ అనుచరగణం వుంది. అలా చీరాల వైసీపీలో ఆధిపత్య పోరుకు జగన్ చెక్ పెట్టినట్లయ్యింది.   
 

Follow Us:
Download App:
  • android
  • ios