Asianet News TeluguAsianet News Telugu

ఒడిశా : నవీన్ పట్నాయక్‌తో ముగిసిన జగన్ భేటీ .. నీటి, సరిహద్దు వివాదాలపై జాయింట్ కమిటీ

ఒడిశా ముఖ్యమంత్రి (odisha cm) నవీన్‌ పట్నాయక్‌తో (naveen patnaik) ఆంధ్రప్రదేశ్‌ సీఎం (ap cm)  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jaganmohan reddy) భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని సచివాలయంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో వైఎస్‌ జగన్‌ చర్చించినట్లుగా తెలుస్తోంది

ap cm ys jagan meets odisha cm naveen patnaik
Author
Bhubaneswar, First Published Nov 9, 2021, 6:39 PM IST

ఒడిశా ముఖ్యమంత్రి (odisha cm) నవీన్‌ పట్నాయక్‌తో (naveen patnaik) ఆంధ్రప్రదేశ్‌ సీఎం (ap cm)  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (ys jaganmohan reddy) భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని సచివాలయంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో వైఎస్‌ జగన్‌ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో జగన్ చర్చలు జరుపుతున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.

Also Read:రేపు ఒడిశాకు వెళ్లనున్న సీఎం YS Jagan.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష.. ముఖ్యంగా వీటి మీదే ఫోకస్..

ప్రధానంగా వంశధార నదిపై (vamsadhara river) నేరేడి బ్యారేజీ (neradi barrage)నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణం, కొఠియా గ్రామాల సమస్యలపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్ చర్చించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి జాయింట్ కమిటీ వేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు.

Follow Us:
Download App:
  • android
  • ios