రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం ఆయనతో చర్చించనున్నారు. జగన్‌ అంతకుముందుత కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో పాటు నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. పోలవరంతో సహా ఏపీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు.

Also Read:పోలవరంపై అంచనాలు, కాస్త కనికరించండి.. ఇంత భారం మోయలేం: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌తో జగన్

అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌కు ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ స్వాగతం పలికారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు.