Asianet News TeluguAsianet News Telugu

నవంబర్ లో జగన్ కేబినెట్ పునర్వవ్యస్థీకరణ: ముగ్గురు మంత్రులపై వేటు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్ ను పునర్వవ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనే మంత్రుల పనితీరుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ మాసంలో జగన్ కేబినెట్ పునర్వవ్యస్థీరించాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతుంది. 
 

AP CM YS Jagan likely To Reshuffle Cabinet In November
Author
First Published Sep 8, 2022, 11:34 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్ ను పునర్వవ్యవస్థీకరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ ఏడాది నవంబర్ మాసంలో  కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ  చేసే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు మంత్రులను మంత్రి వర్గం నుండి తప్పించే అవకాశం ఉంది.మంత్రి పదవిని కోల్పోయే మంత్రుల్లో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని ప్రచారం సాగుతుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై  ఏపీ సీఎం  వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై  టీడీపీ  విమర్శలు గుప్పించింది. ఈ విషయమై మంత్రులు అదే స్థాయిలో తిప్పికొట్టలేదు. పార్టీ నాయకత్వం నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా  కొందరు మంత్రులు సరిగా స్పందించని విషయమై సీఎం జగన్ దృష్టికి వచ్చింది.  ఈ విషయమై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నారు. 

నిన్న కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో కొద్దిసేపు సీఎం జగన్ మాట్లాడారు. విపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నారనే విషయమై మంత్రులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రులు తమ శాఖపై పట్టు సాధించలేకపోయారని కూడా సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు. పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రులను సీఎం హెచ్చరించారు. తమ తమ శాఖలపై కూడ మంత్రులు పట్టు సాధించకపోవడంపై కూడా సీఎం సీరియస్ గా ఉన్నారు. తమ పనితీరును మార్చుకోకపోతే మంత్రివర్గం నుండి కూడా తప్పించాల్సి వస్తుందని కూడా సీఎం హెచ్చరించారు. మంత్రి పదవి అధికారం, హోదా అనే విషయంగా కొందరు భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.

తమ బాధ్యతగా ఫీలై పనిచేయకపోవడంపై జగన్ మండిపడ్డారు.  అవసరమైతే కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ చేయాల్సి వస్తుందని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ మాసంలో కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ వద్దకు మంత్రుల పనితీరుపై నివేదిక  వచ్చింది. 
అవసరమైతే కేబినెట్ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జగన్ కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేశారు. ఏప్రిల్ 11న కొత్త కేబినెట్ ప్రమాణం చేసింది. 13 మంది కొత్తవారికి సీఎం జగన్ తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. అంతకు ముందు కేబినెట్ లో పనిచేసిన 11 మందికి మరోసారి కేబినెట్ లో కొనసాగే అవకాశం కల్పించారు. గత కేబినెట్ లో పనిచేసిన వారిని పార్టీ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే కేబినెట్ ను కొనసాగించాలని జగన్  భావించారు. అయితే మంత్రుల పనితీరు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు.  మంత్రుల పనితీరును బట్టి కేబినెట్ లో చోటు ఉంటుంది,. లేకపోతే కేబినెట్ నుండి తప్పించే అవకాశం ఉంది.

also read:తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవు.. మంత్రలపై సీఎం జగన్ సీరియస్!

2019లో సీఎంగా జగన తో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి రెండేళ్ల పాటు మాత్రమే అవకాశం ఇస్తామని జగన్ చెప్పారు.రెండేళ్ల తర్వాత  కొత్తవారికి అవకాశం ఇస్తామని చెప్పారు.ఈ మాట ప్రకారంగానే ఈ ఏడాది ఏప్రిల్ లో కేబినెట్ పునర్వవ్యస్థీరణ చేసిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios