ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని చెప్పిన సీఎం జగన్.. తమకేం పట్టదని మంత్రులు వ్యవహరించడం సరికాదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని చెప్పిన సీఎం జగన్.. తమకేం పట్టదని మంత్రులు వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తున్న కొందరు మంత్రులు స్పందించడం లేదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా స్పందించరా అని మంత్రులను సీఎం జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, వాటి అనుకూల మీడియా చేసే అసత్య ప్రచారాన్ని మంత్రులు తప్పనిసరిగా తిప్పికొట్టాలని స్పష్టం చేశారు. తీరు మారకంటే మరోసారి కేబినెట్‌లో మార్పులు చేయమంటారా? అని సీఎం జగన్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రెండు నెలల సమయం ఇస్తున్నానని తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించడానికి కూడా వెనకాడనని సీఎం జగన్ మంత్రులకు గట్టిగానే చెప్పినట్టుగా సమాచారం.
అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రులు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి దూరంగా ఉండటంతోనే సీఎం జగన్ ఈ విధమైన హెచ్చరికలు జారీచేసినట్టుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించింది.
నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్‌ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఒక్కో లోక్ అదాలత్‌లకు పది పోస్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు పెట్టాలి... ఏపీ ఛారిటబుల్, హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన సవరణ బిల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో నోవాటెల్ గ్రూప్‌కు చెందిన ఫైవ్ స్టార్ హోటల్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ పార్క్ నిర్మాణాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఏపీసీఆర్డీఏలోనూ కొన్ని సవరణలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
