ప్రతి పార్లమెంట్ పరిధిలో స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ: పులివెందులలో సీఎం జగన్

పులివెందుల ఇండస్ట్రీయల్ పార్క్ లో  ఆదిత్య బిర్లా  గ్రూప్  గార్మెంట్స్ పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. మూడు రోజుల టూర్ లో భాగంగా సీఎం జగన్ ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు.

AP CM YS Jagan Lays Foundation stone to Aditya Birla Garment Factory

పులివెందుల: రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో  స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు.పులివెందులలోని ఇండస్ట్రీయల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్  రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం  Ys Jagan శుక్రవారం నాడు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో Aditya Birla ఒకటని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.గార్మెంట్స్ తయారీలో ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 110 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2112 మందికి ఉపాధి కల్పించనుంది కంపెనీ.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు.ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి అని సీఎం జగన్ చెప్పారు.ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు  వస్తాయని సీఎం జగన్ చెప్పారు. 

also read:Christmas 2021: అమానుషత్వం నుండి మానవత్వానికి... జీసస్ సందేశాన్ని గుర్తుచేసిన సీఎం జగన్

ఇలాంటి మంచి కంపెనీ Pulivendulaలో వస్త్ర పరిశ్రమను స్థాపించడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఆదిత్య బిర్లా కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకోవడం చారిత్రాత్మక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. ఆదిత్య బిర్లా కంపెనీలో సుమారు 85 శాతం మంది మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించారని సీఎం చెప్పారు.  పులివెందులలో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన ఆదిత్య బిర్లా కంపెనీ యాజమాన్యానికి సీఎం జగన్ చెప్పారు.

పులివెందుల తన నియోజకవర్గం అంటూ సీఎం జగన్  బిర్లా కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాదు ఇండస్ట్రీయల్ పార్క్ కు సమీపంలోనే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇళ్ల  నిర్మాణాన్ని చేపడుతున్న వషయాన్ని కూడా సీఎం జగన్  ఈ సందర్భంగా తెలిపారు. 

మూడు రోజుల పాటు సీఎం  కడప జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గురువారం నాడు ప్రొద్దుటూరులో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇవాళ పులివెందులో ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్యాక్టరీ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద జగన్ నివాళులర్పించారు. క్రిస్‌మస్ ను పురస్కరించుకొని సీఎం జగన్ రేపు పులివెందుల చర్చిలో ప్రార్దనలు చేయనున్నారు. 

క్రిస్మస్ ను పురస్కరించుకొని సీఎం జగన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.'దైవ కుమారుడు జీసస్‌  మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నాం. క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు... అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన'' అని జగన్ పేర్కొన్నారు.

''దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం... ఇవీ జీసస్‌ తన జీవితం ద్వారా మనకు ఇచ్చిన సందేశాలు'' అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. . 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios