కాకినాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గ్రామ వార్డు, సచివాలయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కరపలో గ్రామ సచివాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 

కరప గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం కరప గ్రామ సచివాలయాన్ని సీఎం జగన్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల  కన్నబాబు ప్రారంభించారు. 

అనంతరం గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులతో సీఎం జగన్ ముచ్చటించారు. నీతి నిజాయితీలతో పనిచేయాలని జగన్ సూచించారు. ప్రజలకు మంచి సేవలు అందించాలని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనించేలా సేవలు అందించాలని సీఎం జగన్ సూచించారు. 

జాతిపిత మహాత్మగాంధీ జయంతి సందర్భంగా గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తోందని అందుకు అందరు ఉద్యోగులు కలిసిరావాలని సూచించారు.